ap crime news : రాష్ట్రంలో పలు జిల్లాల్లో ముగ్గురు దారుణ హత్యకు గురైయ్యారు. మరో జిల్లాలో రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
అనుమానంతో హత్య..
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో భాగ్యలక్ష్మిపేటలో దారుణం జరిగింది. అనుమానంతో కట్టుకున్న భార్యను కత్తితో పొడిచాడో ఓ దుర్మార్గుడు. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
బండరాళ్లతో కొట్టి..
గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం పెదనమలిపురిలో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన తాటికొండ నవీన్(19)ను దుండగులు బండరాళ్లతో కొట్టి హత్య చేశారు. హత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
గొంతుకోసి..
విశాఖ జిల్లా ఆనందపురం మండలం కల్లివానిపాలెంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న పైడిరెడ్డిని గుర్తు తెలియని దుండగులు గొంతుకోసి చంపేశారు.