పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో బాలలు.. లైంగిక వేధింపుల వ్యతిరేక ప్రచార ఉద్యమాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి రాష్ట్ర చైల్డ్ రైట్స్ ఫోరం అధ్యక్షుడు స్నేహం హాజరయ్యారు. అంగన్వాడి కార్యకర్తలు, స్వచ్ఛంద సేవాసంస్థలు పాల్గొన్నాయి. బాలికలకు అవగాహన కల్పించారు. దేశంలో పదిహేను నిమిషాలకు ఒక బాలికపై అఘాయిత్యం జరుగుతుందన్నారు. ప్రస్తుత సమాజంలో ఆడపిల్లలకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో ప్రతి పౌరుడిలో మార్పు రావాలన్నారు. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు.
ఆడ పిల్లలకు రక్షణ కరువైంది - child rights
ప్రస్తుత సమాజంలో ఆడపిల్లలకు రక్షణ కరువైందని రాష్ట్ర చైల్డ్ రైట్స్ ఫోరం అధ్యక్షుడు స్నేహం అన్నారు.
ర్యాలీ