ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె.ఎ.పాల్ నరసాపురం, కాకినాడ, విశాఖపట్టణం ఎంపీ స్థానాలలో ఎక్కడనుంచైనా పోటీ చేయటానికి తాను సిద్ధమని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కె.ఎ. పాల్ స్పష్టం చేశారు. అవసరమైతే ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు జగన్, పవన్లపై పోటీ చేస్తానన్నారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో నిర్వహించిన పార్టీ సమావేశంలో పాల్గొన్న ఆయన అవినీతిపరులకు, అసమర్థులకు ఓటు వేయవద్దని పిలుపునిచ్చారు. కుటుంబ పాలనతో విసిగిపోయిన ప్రజలు కొత్త మార్గదర్శకత్వం కోసం ఎదురుచూస్తున్నారన్నారు.
ఇదీ చదవండి