ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జిల్లాలో తాజాగా మరో 9 పాజిటివ్ కేసులు - eluru covid hospital latest news in telugu

పశ్చిమగోదావరి జిల్లాలో తాజాగా మరో తొమ్మిది కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వారణాసి నుంచి జిల్లాకు వచ్చిన తొమ్మిదిమందికి పాజిటివ్​ రావటంతో వారిని ఏలూరు కొవిడ్​ ఆస్పత్రికి తరలించారు.

జిల్లాలో తాజా మరో 9 పాజిటివ్ కేసులు
జిల్లాలో తాజా మరో 9 పాజిటివ్ కేసులు

By

Published : May 8, 2020, 5:01 PM IST

పశ్చిమగోదావరి జిల్లాలో తొమ్మిది కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వారణాసి నుంచి జిల్లాకు వచ్చిన తొమ్మిదిమందికి పాజిటివ్​గా తేలింది. తాడేపల్లిగూడెం క్వారంటైన్​ కేంద్రం నుంచి వీరిని ఏలూరు కొవిడ్​ ఆస్పత్రికి తరలించారు. ఉండ్రాజవరంకు చెందిన ఐదుగురు, చాగల్లులో ఒకటి, నిడదవోలులో రెండు, గోపాలపురంలో ఒకటి చొప్పున పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరంతా లాక్​డౌన్​ ముందు ఉత్తరభారత దేశ యాత్రకు వెళ్లారు.

40రోజులపాటు అక్కడే ఉండిపోయారు. ఒకే వాహనంలో వచ్చిన వీరిని అధికారులు క్వారంటైన్​కు తరలించి.. పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో 9మందికి పాజిటివ్ రావడం వల్ల.. ఐసోలేషన్​కు పంపారు. మిగిలినవారిని క్వారంటైన్​ సెంటర్లో ఉంచారు. జిల్లాలో ఇప్పటివరకూ మొత్తం 68పాజిటివ్ కేసులు నమోదుకాగా... వారిలో 33మంది డిశ్చార్జ్ చేశారు. మిగిలిన 35మంది ఏలూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

కేసుల వివరాలు

ఏలూరులో అత్యధికంగా 20కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పెనుగొండలో 17, తాడేపల్లిగూడెంలో 5, భీమవరం 5, ఉండ్రాజవరం 5, నిడదవోలు 2, పోలవరం 3, కొవ్వూరు 2, గుండుగొలను 2, భీమడోలు 1, ఉండి 1, నరసాపురం 1, టీ. నరసాపురం 1, గోపాలపురం 2, చాగల్లు 1, ఆకివీడు 1 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ఇదీ చూడండి:'ఇక్కడ కరోనా బాధితులందరూ కోలుకున్నారు'

ABOUT THE AUTHOR

...view details