తాళ్లపాక అన్నమాచార్యుని జయంతి ఉత్సవాలు పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఘనంగా జరిగాయి. రాష్ట్ర చేనేత కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ సరళాదేవి ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అన్నమాచార్య విగ్రహం వద్ద వేడుకలు నిర్వహించారు. విగ్రహానికి పూలమాల వేసి పూజలు చేశారు.
తణుకులో తాళ్లపాక అన్నమాచార్యుని జయంతి ఉత్సవాలు - annamacharya birth anniversary at tanuku news
పశ్చిమగోదావరి జిల్లా తణుకులో తాళ్లపాక అన్నమాచార్యుని జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చేనేత కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ సరళాదేవి పాల్గొని..ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
తణుకులో తాళ్లపాక అన్నమాచార్యుని జయంతి ఉత్సవాలు
కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించి వేంకటేశ్వరునిపై 32 వేల కీర్తనలు రచించి ఆలపించిన అన్నమాచార్య చిరస్మరణీయుడు అని ఆమె పేర్కొన్నారు. సామాన్య జనానికి సైతం అర్థమయ్యే రీతిలో సరళమైన భాషలో కీర్తనలు రాశారని అన్నారు. కీర్తనల ద్వారా ప్రజల గుండెల్లో ఆధ్యాత్మిక భావాలు నెలకొల్పిన మహామనిషి అన్నమాచార్యులని ఆమె కొనియాడారు.
ఇదీ చూడండి.'యాస్' ఉగ్రరూపం- 11 లక్షల మంది తరలింపు