ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అన్యాయం జరిగిందని అంగన్‌వాడి కేంద్రాలకు తాళాలు - అంగన్వాడి మహిళకు అన్యాయం కేంద్రనికి తాళం

అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ఇద్దరు మహిళలు పోరాటం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని అంగన్‌వాడి కేంద్రాలకు తాళం వేశారు. విశాఖ, పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన ఈ సంఘటనలతో చిన్న పిల్లలు ఆరుబయట ఆకలి తీర్చుకుంటున్నారు.

అంగన్వాడి మహిళకు అన్యాయం..కేంద్రనికి తాళం

By

Published : Oct 16, 2019, 11:50 PM IST

అంగన్వాడి మహిళకు అన్యాయం..కేంద్రనికి తాళం

విశాఖలో ఇలా...

విశాఖ మన్యంలోని అరకులోయ మాలి అంగన్వాడి ఆయా పోస్టు ఎంపికలో తనకు అన్యాయం జరిగిందని భాగమతి అనే మహిళ కేంద్రానికి తాళం వేసింది. తమకు న్యాయం చేయాలని కోరుతూ గత ఆరు రోజుల నుంచి అంగన్వాడి భవనానికి తాళం వేసింది.
పశ్చిమగోదావరి జిల్లాలో అలా

తమకు అనుకూలంగా ఉన్న వ్యక్తులే పనిచేయాలి.. మీరు పనిచేయడానికి వీల్లేదంటూ.. అంగన్వాడీ కేంద్రానికి అధికార నాయకుడొకరు తాళం వేశారు. భవనం తాళం తీస్తే.. పరిస్థితి తీవ్రంగా ఉంటుందని హెచ్చరించాడు. అంగన్వాడీ సిబ్బంది ఆరుబయటే తరగతులు నిర్వహించారు. చిన్నారులకు అక్కడే భోజనాలు వడ్డించారు. పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి బాపిరాజుగూడెంలో ఈ ఘటన చోటుచేసుకొంది.

ఇదీ చదవండి:'పిఠాపురం మహారాజా కళాశాల అభివృద్ధికి కృషిచేస్తా'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details