సమాజం బాగుండాలని నిత్యం దేవతార్చన చేసి ఆశీర్వచనం చేసే పురోహితులు.. అంకితభావతో క్రికెట్ ఆడేందుకు సమయం కేటాయించటం.. మంచి పరిణామమని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి. కృష్ణ మోహన్ అన్నారు. భీమవరంలోని ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలోని క్రీడా మైదానంలో నిర్వహించిన పురోహిత క్రికెట్ లీగ్ పోటీల్లో.. విజేతలకు బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. క్రీడలతో శారీరక దారుఢ్యం మెరుగవుతుందని తెలిపారు. భీమవరం ప్రాంత ప్రజలు అందించిన ఆతిథ్యాన్ని తానెప్పుడు మర్చిపోలేనన్నారు.
టోర్నమెంట్ విన్నర్స్ ధర్మగిరి జట్టుకు కప్పును, రూ.60వేల నగదును కృష్ణ మోహన్ అందజేశారు. ఈ పోటీల్లో రన్నర్ గా నిలిచిన కాకినాడ జట్టుకు రూ.30 వేల నగదు బహుమతిని కృష్ణమోహన్ చేతులమీదుగా అందించారు. ఈ సందర్బంగా జస్టిస్ కృష్ణమోహన్, వసంతలక్ష్మి దంపతులను టోర్నమెంట్ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు.