AP Civil Supplies Department MD comments: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ ఏడాదిలో సుమారు రైతుల నుంచి 26 లక్షల 8 వేల 125 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు.. పౌర సరఫరా శాఖ ఎండీ వీరపాండియన్ తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన 4 లక్షల 73 వేల 53 మంది రైతులకు 5 వేల 324.31 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. వీటిలో 90 శాతం అంటే 4 వేల 779.85 కోట్లను 4 లక్షల 68 వేల 587 మంది రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు.
ఇప్పటి వరకు 26 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశాం: పౌర సరఫరా శాఖ ఎండీ - details of grain purchase
AP Civil Supplies Department MD comments: రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు రైతుల నుంచి 26 లక్షల 8 వేల 125 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని పౌర సరఫరా శాఖ ఎండీ వీరపాండియన్ ధాన్యం కొనుగోలుకు సంబంధించిన వివరాలను తెలియజేశారు. 4 లక్షల 68 వేల 587 మంది రైతుల ఖాతాల్లో సుమారు 4 వేల 779.85 కోట్లను జమ చేశామని పేర్కొన్నారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా ధాన్యం కొనుగోలు చేసిన వారం రోజుల్లోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేసినట్లు వివరించారు. రైతులు తమ సొంత ఖర్చులతో గోనె సంచులు, హమాలీలు, రవాణా ఖర్చులు ఏర్పాటు చేస్తే సదరు ఖర్చులు మద్దతు ధరతో పాటు 21 రోజుల్లో చెల్లిస్తున్నట్లు తెలిపారు. గోనె సంచుల చార్జీలు, హమాలీ చార్జీలు, రవాణా చార్జీలకు గాను 61.48 కోట్లకు గాను 36 శాతం అంటే 21.87 కోట్లను చెల్లించినట్లు వెల్లడించారు. రైతులకు ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా రైతు భరోసా కేంద్రం వద్ద అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఇవీ చదవండి