ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

LOVE MARRIAGE: వివాహంతో ఒక్కటైన ఆంధ్రా అబ్బాయి.. అమెరికా అమ్మాయి - andra men married american

ప్రేమకు ప్రాంతం, భాష, కులం ఇవేవీ అక్కర్లేదని ఆ జంట. చదువు కోసమని అమెరికా వెళ్లిన ఆంధ్రా అబ్బాయి అమెరికా యువతితో ప్రేమలో పడ్డాడు. ఆ ప్రేమను ఇరువురి కుటుంబసభ్యుల సమ్మతితో పెళ్లి పీటల వరకు తీసుకెళ్లింది ఆ జంట. ద్వారకాతిరుమలలోని వేంకటేశ్వరస్వామి సన్నిధిలో బుధవారం రాత్రి వివాహం చేసుకున్నారు.

american
american

By

Published : Aug 20, 2021, 12:26 PM IST

ప్రేమకు ఎల్లలు లేవని నిరూపించారు. వివాహ బంధంతో ఆంధ్రా అబ్బాయి, అమెరికా అమ్మాయి ఒక్కటయ్యారు. పెదవేగి మండలం కొప్పులవారిగూడేనికి చెందిన నందిగర నారాయణరావు, ఉషారాణి దంపతుల కుమారుడు శివశంకర్‌ ఉద్యోగం నిమిత్తం అమెరికాలోని వర్జీనియాకు ఎనిమిదేళ్ల కిందట వెళ్లారు. మిత్రుల ద్వారా అమెరికా అమ్మాయి మిలిస్సా పరిచయమైంది. అది కాస్తా ప్రేమగా మారి పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకొని శివశంకర్‌ తల్లిదండ్రులకు తెలిపి వారి అనుమతి కోరారు. తొలుత వారు అంగీకరించకున్నా ప్రేమికులిద్దరూ వారికి నచ్చజెప్పడంతో వివాహానికి ఒప్పుకొన్నారు. వారు కొప్పులవారిగూడెం వచ్చారు.

ద్వారకాతిరుమలలోని వేంకటేశ్వరస్వామి సన్నిధిలో బుధవారం రాత్రి వివాహం చేసుకున్నారు. భారతదేశమన్నా, హిందూ సంప్రదాయమన్నా తనకెంతో ఇష్టమని వధువు మిలిస్సా తెలిపారు. ఆంధ్రా అబ్బాయితో వివాహం తనకు సంతోషాన్ని ఇచ్చిందన్నారు. కొప్పులవారిగూడెంలో గురువారం రిసెప్షన్‌ ఏర్పాటు చేయగా కొత్త దంపతులను బంధువులు, గ్రామస్థులు, ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి, సర్పంచి అభినందించి, ఆశీస్సులు అందజేశారు.

ఇదీ చదవండి:'హత్య కేసు నమోదు చేయండి.. అప్పటివరకూ శవపరీక్షకు అనుమతించం'

ABOUT THE AUTHOR

...view details