ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తణుకులో బోల్తా పడిన ఆటో.. ఒకరు మృతి - తణుకు రోడ్డు ప్రమాదాలు

ఆటో అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో.. ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురు గాయపడ్డారు.

An auto overturned
తణుకులో బోల్తా పడిన ఆటో.. ఒకరు మృతి

By

Published : Jan 22, 2021, 2:00 PM IST

Updated : Jan 22, 2021, 2:26 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ వద్ద వెంకయ్య కాలువ వంతెనపై ఓ ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో.. యేసు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. బాధితులను తణుకులోని జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు.

ఆటోలో డ్రైవింగ్ సీట్ బోల్టులు ఊడిపోవడంతో పక్కకు పడిపోయి.. ఆటో బోల్తా కొట్టిందని ప్రత్యేక్ష సాక్షులు చెప్తున్నారు. స్థానికులు అంబులెన్స్ కు ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో... చివరకు హైవే పోలీసులు తమని ఆస్పత్రికి తీసుకొచ్చారని బాధితులు చెబుతున్నారు.

Last Updated : Jan 22, 2021, 2:26 PM IST

ABOUT THE AUTHOR

...view details