అనారోగ్య సమయంలో టక్కున గుర్తుకొచ్చేది 108 వాహనం. సమాచారం అందిన వెంటనే వచ్చి ఎంతో మందికి వైద్య సేవలు అందిస్తుంది. కానీ అంబులెన్స్లకు, అందులో పనిచేసే సిబ్బందికి కనీస వసతులు లేకపోవడం పట్ల తీవ్ర ఆవేదన చెందుతున్నారు. కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేస్తున్న అంబులెన్సుల నిర్వహణ కోసం ప్రభుత్వం సరైన వసతులను ఏర్పాటు చేయడం లేదు. ఫలితంగా రంగులు వెలిసిపోయి, తుప్పు పట్టి మరమ్మతులకు గురవుతున్నాయి. కొద్దికాలానికే ఈ వాహనాలు దెబ్బతింటున్నాయి. ఈ క్రమంలో అత్యవసర సేవలకు విఘాతం ఏర్పడుతోంది. పశ్చిమగోదావరి జిల్లాలో ఉన్న 50 వాహనాల్లో.. 42 వాహనాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఆరు వాహనాలకు షెడ్లు ఉన్నాయి. అలాగే ఇందులో పనిచేసే సిబ్బంది తలదాచుకునేందుకు స్థలం లేకపోవడంతో వారు ఇబ్బందులు పడుతున్నారు. ఫలితంగా ప్రభుత్వ కార్యాలయాల్లోని నిరుపయోగంగా ఉన్న గదుల నుంచి విధులు నిర్వహిస్తున్నారు. తాగునీటి వసతి, మరుగుదొడ్లూ.. లేకపోవడం వలన మహిళా సిబ్బంది అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
జిల్లాలో 108 వాహనాలు, సిబ్బంది వివరాలు..
మొత్తం వాహనాలు - 50, అందుబాటులో ఉన్నవి - 42, కొత్తవి - 27, డ్రైవర్లు - 125, టెక్నీషియన్లు -125
దాతలు సహకరించాలి..