అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా జులై 4న ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఆవిష్కరించనున్న 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏఎస్‌ఆర్ పార్కు ప్రాంగణంలో వేదికపై అమర్చారు. మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు ప్రత్యేక పూజల తర్వాత విగ్రహాన్ని ఏడు అడుగుల కాంక్రీటు దిమ్మపైకి చేర్చారు. అల్లూరి అతిపెద్ద కాంస్య విగ్రహం ఇదేనని క్షత్రియ సేవా సమితి ప్రతినిధులు చెప్పారు. దీని తయారీకి 10 టన్నుల కాంస్యం, 5 టన్నుల ఇనుము వాడారు. దాదాపు రూ.3 కోట్ల వరకు వెచ్చించారు. సీబీఐ పూర్వ జేడీ వీవీ లక్ష్మీనారాయణ, ఇతర ప్రముఖులు మంగళవారం అల్లూరి విగ్రహాన్ని సందర్శించారు.
Alluri Statue: 30 అడుగుల విగ్రహం.. రూ.3 కోట్ల వ్యయం
Alluri Bronze statue: జులై 4న ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో పర్యటించనున్నారు. భీమవరంలోని ఏఎస్‌ఆర్ పార్కు వద్ద రూ.3కోట్ల వ్యయంతో నిర్మించిన 30 అడుగుల అల్లూరి కాంస్య విగ్రహాన్ని ప్రధాని అవిష్కరించనున్నారు.
అల్లూరి కాంస్య విగ్రహాం