పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో నాటుసారా అనుమానిత మరణాలపై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఐదుగురు వ్యక్తులు మాత్రమే వివిధ అనారోగ్య కారణాలతో మృతి చెందినట్లు తెలిపారు. ఈ రోజు చనిపోయిన ఒడిశా వాసి ఉపేంద్ర గుండె సంబంధిత సమస్యలతో చనిపోయినట్లు ఆధారాలు ఉన్నాయని తెలిపారు. మిగిలిన నలుగురు గత కొద్ది రోజులుగా... విఫరీతంగా మద్యం సేవించడం వల్లే మృతిచెందారని వారి కుటుంబ సభ్యులు చెబుతున్నట్లు తెలిపారు.
నాటుసారా మరణాలపై అధికారులతో భేటీ అయిన ఆళ్ల నాని - AP News
జంగారెడ్డిగూడెంలో నాటుసారా అనుమానిత మరణాలపై ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని అధికారులతో సమావేశం నిర్వహించారు. కల్తీ మద్యం లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారని... అయినా కొందరు ఇలాంటి అక్రమ మద్యం విక్రయాలకు పాల్పడుతున్నారని అన్నారు. అటువంటి వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
తెలంగాణ సరిహద్దు సమీప ఉండటంతో నిత్యం పోలీసులు, ఎక్సైజ్, ఎస్ఈబీ అధికారులు అప్రమత్తంగా ఉండి కేసులు నమోదు చేస్తున్నారన్నారు. గడిచిన మూడు సంవత్సరాల కాలంలో సుమారు 13వేల కేసులు నమోదు చేశారన్నారు. 2400 మద్యం తరలించే వాహనాలు సీజ్ చేశారన్నారు. ముగ్గురిపై పీడీ యాక్టు, 4721మందిపై బైండోవర్ కేసులు నమోదయ్యాయన్నారు. కల్తీ మద్యం లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారని... అయినా కొందరు ఇలాంటి అక్రమ మద్యం విక్రయాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారని తెలిపారు.
ఇదీ చదవండి: 'నా కోడిని చంపేశారు... న్యాయం చేయండి'