పశ్చిమగోదావరి జిల్లాలోని అన్ని కొవిడ్ ఆసుపత్రుల్లో బాధితులకు అవసరమైన సమాచారం ఇవ్వడానికి హెల్ప్‌డెస్క్‌లు మరింతగా పటిష్టంగా పని చేయడానికి చర్యలు తీసుకోవాలని... మంత్రి ఆళ్ల నాని జిల్లా యంత్రాంగానికి, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు, హాస్పిటల్ సూపరింటెండెంట్స్ను అదేశించారు. జిల్లా వ్యాప్తంగా కొవిడ్ హాస్పిటల్స్‌లో 24గంటల పాటు షిఫ్ట్ పద్ధతిలో సిబ్బందిని నియమించాలని అధికారులను అదేశించారు.
జిల్లా వ్యాప్తంగా కొవిడ్ హాస్పిటల్స్‌లో ప్రతి హెల్ప్‌డెస్క్‌లో ఒక మేనేజర్, ముగ్గురు డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ఉంటారని సూపరింటెండెంట్ మోహన్ మంత్రికి తెలిపారు. కొవిడ్ హాస్పిటల్స్ అడ్మిషన్స్ తగ్గినా సరే చాలా అప్రమత్తంగా ఉండాలని, ఆక్సిజన్ పైపు లైన్స్, ఆక్సిజన్ నిల్వలు సంబందించిన పనులు నిలిపి వేయవద్దని, వాటిని పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగానికి మంత్రి అదేశాలు ఇచ్చారు.
ఏసమయంలోనైనా కొవిడ్ విస్తరించినా సరే పూర్తి స్థాయిలో మెరుగైన వైద్యం అందించడానికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని మంత్రి స్పష్టం చేశారు. ఐసీయూ, నాన్ ఐసీయూ బెడ్స్ ఆధారంగా ఆక్సిజన్ సదుపాయాలపై కార్యాచరణ ఉండాలని, వివిధ హాస్పిటల్స్‌లో ఏర్పాటు చేస్తున్న పీఎస్ఏ ఆక్సిజన్ జనరేషన్ నుంచి ఈ బెడ్స్‌కు ఆక్సిజన్ అందడానికి చర్యలు తీసుకోవాలన్నారు.