కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 26న తలపెట్టిన భారత్ బంద్‌ను విజయవంతం చేయాలని అఖిలపక్ష నాయకులు పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు స్వరాజ్య భవనంలో నిర్వహించిన సమావేశంలో నియోజకవర్గ పరిధిలోని అఖిలపక్ష నాయకులు పాల్గొన్నారు. కార్మికులకు, రైతులకు ఇబ్బంది కలిగించేలా కేంద్రం ప్రవేశపెడుతున్న చట్టాలను రద్దు చేయాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. బంద్‌కు సహకరించాలని కోరుతూ గోడ పత్రికలను ఆవిష్కరించారు.
'26న భారత్ బంద్‌ను విజయవంతం చేయాలి' - Tanuku latest news
ఈ నెల 26న తలపెట్టిన భారత్‌బంద్‌ను విజయవంతం చేయాలని అఖిలపక్షం నాయకులు పిలుపునిచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో నిర్వహించిన సమావేశంలో గోడ పత్రికలను ఆవిష్కరించారు.
పశ్చిమగోదావరి జిల్లా తణుకులో అఖిలపక్షం నేతల సమావేశం