పశ్చిమగోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గం జీలుగుమిల్లి మండలం పీ. రాజవరంలో రైతు భరోసా కేంద్రాన్ని ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ప్రారంభించారు. ఈ కేంద్రాల ద్వారా అన్ని రకాల సేవలను గ్రామస్థాయిలో అందిస్తూ... రైతన్నలు కార్యాలయాల చుట్టూ తిరిగే బాధ తప్పిస్తామన్నారు. దేశానికి పట్టుకొమ్మలైన పల్లెలు అభివృద్ధి చెందాలంటే అన్నదాత ఆర్థికంగా బలోపేతం కావాలని అభిప్రాయపడ్డారు. రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తూ వారి అభ్యున్నతికి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు.
'అన్ని వర్గాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం' - పశ్చిమగోదావరి జిల్లాలో ఆర్బీకే వార్తలు
రైతు భరోసా కేంద్రాల ద్వారా అన్నదాతలకు అన్ని రకాల సేవలు గ్రామస్థాయిలో అందిస్తామని పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాలు అభివృద్ధి చెందడమే వైకాపా ప్రభుత్వ ధ్యేయం అని తెలిపారు.
ఆర్బీకే ప్రయోజనాలను వివరిస్తోన్న ఎమ్మెల్యే బాలరాజు