తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో ముంపు ప్రాంతాలను పరిశీలించారు. ఈ క్రమంలో ఈ క్రమంలో ఆకివీడు నుంచి సిద్ధాపురానికి ట్రాక్టర్ నడుపుతూ వెళ్తున్న లోకేశ్ వెంట ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఉన్నారు. సిద్ధాపురం సమీపానికి వచ్చేసరికి ట్రాక్టర్ ఒక వైపుకు వెళ్లిపోవటంతో సమీపంలోని ఉప్పుటేరు అంచు కుంగిపోయింది. అయితే ట్రాక్టర్‌ను చాకచక్యం నిలిపేయటంతో తృటిలో ప్రమాదం తప్పింది. అయితే నారా లోకేశ్ నిర్లక్ష్యంగా ట్రాక్టర్ నడపిపారని... కరోనా ఆంక్షలు పాటించలేదని ఆకివీడు పోలీసులు లోకేశ్‌పై కేసు నమోదు చేశారు. ఆకివీడు ఎస్సై వీరభద్రరావు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ట్రాక్టర్ నిర్లక్ష్యంగా నడిపారని లోకేశ్‌పై కేసు - పశ్చిమ గోదావరి జిల్లాలో లోకేశ్ పర్యటన
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ పై ఆకివీడు పోలీసులు కేసు నమోదు చేశారు. నిర్లక్ష్యంగా ట్రాక్టర్ నడపడం, కరోనా ఆంక్షలు పాటించలేదనే కారణంగా కేసు నమోదు చేశారు.

Akividu police
Last Updated : Oct 26, 2020, 11:18 PM IST