పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు కల్వరి బాప్టిస్ట్ చర్చిలో ఐక్య క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. మతాలకు అతీతంగా క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఎంపీ రఘురామకృష్ణంరాజు, మాజీఎంపీ బాపిరాజు హాజరయ్యారు. తన స్వగ్రామంలో మతాలకు అతీతంగా క్రిస్మస్ వేడుకలు జరగటం ఆనందంగా ఉందని ఎంపీ పేర్కొన్నారు. హిందూ, ముస్లిం, క్రైస్తవ నాయకులను సన్మానించారు. నిరుపేదలకు దుస్తులు పంపిణీ చేశారు.
ఆకివీడులో ఐక్య క్రిస్మస్ వేడుకలు - akivdu Christmas celebrations news
పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో జరిగిన ఐక్య క్రిస్మస్ వేడుకల్లో... ఎంపీ రఘురామకృష్ణంరాజు పాల్గొన్నారు. అన్ని మతాలు ఒకటే అని వ్యాఖ్యానించారు.
ఆకివీడులో ఐక్య క్రిస్మస్ వేడుకలు