ఈనెల 5వ తేదీన కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్మిక వ్యతిరేకంగా ఉందని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కే.కృష్ణమాచార్యులు ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్ ఎదుట జరిగిన ఆందోళనలో ఆయన మాట్లాడారు.బడ్జెట్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి సామాన్యులు మరింత కష్టాల పాలయ్యేలా చేశారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్లోని... పోలవరం ప్రాజెక్టుకు, అమరావతి నిర్మాణానికి బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం సరికాదన్నారు.
ఏలూరు కలెక్టరేట్ ఎదుట ఏఐటీయూసీ ధర్నా - eluru collectorate
కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ను వ్యతిరేకిస్తూ ఏలూరు కలెక్టరేట్ ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి సామాన్యులపై మరింత భారం మోపారని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు.
ఏలూరు కలెక్టరేట్ వద్ద ఏఐటీయూసీ ధర్నా
కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అనుకూలమైన బడ్జెట్ను ప్రవేశపెట్టాలని...ఇది కార్పొరేట్ శక్తులకు రాయితీలు ఇచ్చే విధంగా ఉందని కృష్ణమాచార్యులు విమర్శించారు. ప్రభుత్వ సంస్థలైన బిఎస్ఎన్ఎల్, రైల్వే, ఎల్ఐసి సంస్థలను ప్రైవేటు పరం చేసే ఆలోచనలో కేంద్రం ఉందని ఆయన మండిపడ్డారు.
ఇదీ చూడండి..కనువిందు చేస్తున్న పిచ్చుక గూళ్లు