ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కొందరు చనిపోయారు.. మిగిలిన వారికైనా న్యాయం చేయండి' - పశ్చిమగోదావరి జిల్లా అగ్రిగోల్డ్ బాధితుల వార్తలు

అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో.. అగ్రిగోల్డ్ ఏజెంట్స్ కస్టమర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 48 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. స్వరాజ్ భవన్​లోని సమావేశ మందిరంలో ఈ దీక్ష చేశారు.

agrigold victims protest in tanuku west godavari district
తణుకులో అగ్రిగోల్డ్ బాధితుల దీక్ష

By

Published : May 23, 2020, 5:15 PM IST

ఎన్నికలకు ముందు అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని.. పశ్చిమగోదావరి జిల్లా అగ్రిగోల్డ్ బాధితులు ప్రభుత్వాన్ని కోరారు. డిపాజిట్ చేసి మోసపోయిన బాధితులందరికీ ఆ మొత్తాలను తిరిగి ఇచ్చేలా చేయాలన్నారు.

అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్య పరిష్కరిస్తానని చెప్పిన జగన్.. పాలనలోకి వచ్చి ఏడాది అయినా హామీలు నెరవేర్చలేదని ఆవేదన చెందారు. బాధితుల్లో కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారని.. ఇప్పటికైనా ప్రభుత్వం అగ్రి గోల్డ్ బాధితుల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వీరికి ఏఐటీయూసీ సంఘీభావం తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details