పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలంలోని అప్పారావు పేట, దొంతవరం, కాకర్లమూడి గ్రామాల్లో మంగళవారం వ్యవసాయ అధికారులు పర్యటించారు. నివర్ తుపాన్ ప్రభావంతో దెబ్బతిన్న వరి చేలను పరిశీలించారు. పంట నష్టాన్ని అంచనా వేసి పరిహారం అందిస్తామన్నారు. పంట నష్టపోయిన రైతులకు రాయితీపై విత్తనాలు పంపిణీ చేస్తామని భీమడోలు ఏడీఏ జయదేవరాజన్ తెలిపారు.
'పంట నష్టపోయిన రైతులకు రాయితీపై విత్తనాలు' - west godavari district district latest news
నివర్ తుపాన్ ప్రభావంతో ఉంగుటూరు మండలంలో దెబ్బతిన్న పంటలను వ్యవసాయ అధికారులు పరిశీలించారు. పంట నష్టాన్ని అంచనా వేసి పరిహారం అందిస్తామన్నారు.
దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తున్న వ్యవసాయధికారులు
నీట మునిగిన పొలాలను కూలీలతో కోయిస్తే ఎకరానికి కనీసం 10 నుంచి 13 బస్తాలు దిగుబడి వస్తుందన్నారు. పోలవరం ప్రాజెక్ట్ కాపర్ డ్యాం నిర్మాణ పనుల నిమిత్తం 2021 మార్చి 31 నుంచి జూన్ 10 వ తేదీ వరకు కాలువలకు గోదావరి నీటి సరఫరా నిలిపివేస్తారని, రైతులందరూ ముందస్తు రబీ సాగుకు సన్నద్దం కావాలని సూచించారు. ఏడీఏ వెంట మండల వ్యవసాయధికారి వెంకటేశ్, వీఏఏలు ఉన్నారు.
ఇదీ చదవండి
నిరుపయోగంగా వైఎస్సార్ రిసెప్షన్ కేంద్రాలు.. వాటికి కేటాయిస్తే మేలు!
TAGGED:
unguturu latest news