పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లి కాలువ సమీపంలో.. ఆరడుగుల తాచుపామును కూలీలు హత మార్చారు. వేరుశనగ పొలంలో ఎరువులు వేసేందుకు వెళ్లిన కూలీలు.. బస్తాలను తొలగిస్తుండగా పాము కనిపించింది. వెంటనే కర్రలతో ఆ సర్పాన్ని కొట్టి చంపారు.
ఈ జాతి పాములు మన్యం ప్రాంతంలో అరుదుగా కనిపిస్తాయని కూలీలు తెలిపారు. నల్లతాచు రకానికి చెందిన ఈ సర్పాలు.. అత్యంత విషపూరితమైనవన్నారు. ఇవి కరిచిన గంటల వ్యవధిలోనే బాధితులు చనిపోతారని వెల్లడించారు.