పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో కురిసిన వర్షాలకు కొవ్వాడ కాలువ ఉప్పొంగింది. కొవ్వూరు మండలం కాపవరం వద్ద జాతీయ రహదారిపై కల్వర్టు నిర్మాణం కోసం కాలువకు అడ్డుకట్ట వేశారు. కాగా.. గురువారం భారీగా వర్షం కురవడం వల్ల కాల్వ పొంగి.. 8 వేల ఎకరాల పంటపొలాలను ముంచి వేసింది.
ఉప్పొంగిన కాలువ.. వేలాది ఎకరాల్లో పంట మునక - పశ్చిమ గోదావరి జిల్లాలో వర్షాలు
పశ్చిమగోదావరి జిల్లాలో కురిసిన వర్షానికి కొవ్వాడ కాలువ ఉప్పొంగింది. కట్టలు తెంచుకుని ప్రవహిస్తూ పంట పొలాలను ముంచేసింది. అన్నదాత కళ్లలో కన్నీటిని నింపింది.

ఉప్పొంగిన కాలువ.. వేలాది ఎకరాల్లో పంట మునక
గోపాలపురం మండలం వెంకటాయపాలెం, చిట్యాల, చెరుకుమెల్లి గ్రామాల్లో వందల ఎకరాల్లో వరి, చెరకు, అరటి తోటలు నీటమునిగాయి. కొవ్వూరు, తాళ్లపూడి, గోపాలపురం, దేవరపల్లి మండలాల్లో పలు రకాల పంటలు మునిగిపోయాయి. ముంపునకు గురైన పొలాలను గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు పరిశీలించారు. పంట నష్టం వివరాలను తయారు చేయాలని రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు.
ఇదీచదవండి.