.
ఏజెంట్ చేతిలో మోసపోయిన యువకులు... 25లక్షలు స్వాహా
విదేశాలకు వెళ్లి డబ్బులు సంపాదించి.... కష్టాల నుంచి బయటపడాలనుకునేవారి ఆశలను ఏజెంట్ల మోసాలు నాశనం చేస్తున్నాయి. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పరిసర ప్రాంతాలకు చెందిన 25 మందికిపైగా యువకులు రష్యా వెళ్లేందుకు సిద్ధమయ్యారు. రాయవరం ప్రాంతానికి చెందిన మురళి అనే ఏజెంట్‌కు, అతని ప్రతినిధి సూరిబాబుకు రూ. 25 లక్షలకుపైగా చెల్లించారు.15 రోజుల్లోగా విదేశాలకు పంపుతానని చెప్పిన ఏజెంట్ మూడు నెలలు గడుస్తున్నా ఆచూకీ లేకపోవడంతో మోసపోయామంటూ బాధితులు వాపోతున్నారు.
రష్యా వెళ్లేందుకు ఏజెంట్‌కు రూ.25 లక్షలకు పైగా చెల్లించిన యువకులు