ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

TDP MLA as a paperboy: పేపర్‌బాయ్‌ అవతారమెత్తిన తెదేపా ఎమ్మెల్యే.. - పేపర్‌బాయ్‌గా మారిన పాలకొల్లు ఎమ్మెల్యే

TDP MLA as a paperboy: టిడ్కో ఇళ్ల పంపిణీ జాప్యాన్ని నిరసిస్తూ తెదేపా ఎమ్మెల్యే.. పేపర్‌బాయ్‌ అవతారమెత్తారు. వేకువజామునే పట్టణంలోని మావుళ్లమ్మపేటకు చేరుకున్న ఆయన స్థానిక పేపర్‌బాయ్స్‌తో కలిసి వాటిని చందాదారులకు పంపిణీ చేసేందుకు సమాయత్తమయ్యారు. ఇంతకీ ఆయన ఎవరంటే..?

TDP MLA as a paperboy
పేపర్‌బాయ్‌గా తెదేపా ఎమ్మెల్యే

By

Published : Aug 1, 2022, 10:18 AM IST

TDP MLA as a paperboy: పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆదివారం ఉదయం ఇంటింటికీ దినపత్రికలు అందించే వ్యక్తిగా (పేపర్‌బాయ్‌) అవతారమెత్తారు. వేకువజామునే పట్టణంలోని మావుళ్లమ్మపేటకు చేరుకున్న ఆయన స్థానిక పేపర్‌బాయ్స్‌తో కలిసి వాటిని చందాదారులకు పంపిణీ చేసేందుకు సమాయత్తమయ్యారు. ఒక సైకిల్‌పై పత్రికలను పెట్టుకుని 31వ వార్డులోని నాగరాజుపేట, తదితర ప్రాంతాల్లోని చందాదారులకు అందించారు. టిడ్కో ఇళ్లలో మిగిలిన పది శాతం పనులు పూర్తి చేసి వాటిని ఇవ్వడంలో ప్రభుత్వం చేస్తున్న జాప్యాన్ని లబ్ధిదారులకు వివరించడానికి ఆయన ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. ఆయా ప్రాంతాల్లో పత్రికలు తీసుకోవడానికి వచ్చిన వారికి ప్రభుత్వ తీరును, పట్టణవాసులకు పది కిలోమీటర్ల దూరంలో ఇళ్ల స్థలాలు కేటాయించిన విధానాన్ని వివరించారు. ప్రతి నెలా నాలుగు రోజులు చందాదారులను కలిసి ఇలా దినపత్రికలు అందిస్తూ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై తెలియజేస్తానని, మరో నాలుగు రోజులు పారిశుద్ధ్య పనులు చేపట్టి నిరసనకు దిగుతానని ఎమ్మెల్యే రామానాయుడు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details