పశ్చిమ గోదావరి జిల్లాలో 60 రోజుల తర్వాత ఆర్టీసీ బస్సులు రోడ్లపైకి వచ్చాయి. జిల్లాలోని 8 డిపోల్లో 150 బస్సుల వరకు తిరుగుతున్నట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. బస్సులో ప్రయాణికులకు ముందుగా థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ప్రయాణికులు ఆరోగ్యంగా ఉన్నారని ధృవీకరించుకున్నాకే ప్రయాణానికి అనుమతిస్తున్నారు. వారి పూర్తి వివరాలు నమోదు చేసుకొని, మాస్కులు ధరించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం సూచించిన టికెట్ ధరలకే వారి గమ్యస్థానాలకు చేర్చుతున్నట్లు అధికారులు తెలిపారు.