ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Aerial Survey at Polavaram Flooded Area: పోలవరం ప్రాజెక్టు ముంపు నష్టంపై ఏరియల్‌ సర్వే - Aerial survey

Aerial survey at Polavaram project: ఆదివారం ఉభయగోదావరి జిల్లాల్లోని ముంపు మండలాల్లో చాపర్‌ ద్వారా సర్వే చేశారు. పోలవరం ప్రాజెక్టు ముంపు నష్టంపై స్పష్టత కోసం ఏరియల్‌ సర్వే నిర్వహించినట్లుఅధికారులు తెలిపారు. ప్రాజెక్టులో 45.75 కాంటూరు స్థాయిలో నీరు నిల్వ చేస్తే ఏ ప్రాంతం ముంపునకు గురవుతుందో తెలుసుకునేందుకు ప్రయత్నించారు.

Aerial survey at polavaram flooded area
పోలవరం ప్రాజెక్టు ముంపు నష్టంపై ఏరియల్‌ సర్వే

By

Published : Dec 20, 2021, 10:16 AM IST

Aerial survey at Polavaram project for Damage: పోలవరం ప్రాజెక్టు ముంపు నష్టంపై స్పష్టత కోసం ప్రభుత్వం ఏరియల్‌ సర్వే నిర్వహించింది. ఆదివారం ఉభయగోదావరి జిల్లాల్లోని ముంపు మండలాల్లో చాపర్‌ ద్వారా సర్వే చేశారు. ఇందుకు లైడర్‌ సాంకేతికతను వినియోగించారు. డిఫరెన్షియల్‌ గ్లోబల్‌ పొజిషన్‌ సిస్టం(డీజీపీఎస్‌)కు శాటిలైట్‌ సిగ్నల్స్‌ అనుసంధానం చేయడం ద్వారా ఏ కాంటూరు స్థాయిలో ఏ ప్రాంతం ముంపునకు గురవుతుందో తెలుసుకునే వీలుంటుంది. ముంపును త్రీడీ చిత్రాల ద్వారా సాంకేతిక నిపుణులు అంచనా వేస్తారు.

Aerial survey: దీనికి సంబంధించిన అన్ని యంత్ర, పరికరాలను చాపర్‌లో బిగించారు. వాటి ఆధారంగా సాంకేతిక నిపుణులు ముంపు ప్రాంతాన్ని అంచనా వేయగా.. గోదావరి తీరంలో పలుచోట్ల సాంకేతిక సహాయకులు వారికి సహకారం అందించారు. రాజమహేంద్రవరం విమానాశ్రయం నుంచి బయలుదేరిన చాపర్‌ పోలవరం మీదుగా కుక్కునూరు మండలంలోని తెలంగాణ సరిహద్దు వరకు, తూర్పుగోదావరి జిల్లాలోని దేవీపట్నం నుంచి ఎటపాక మండలంలోని తెలంగాణ సరిహద్దు వరకు సర్వే నిర్వహించారు. చాపర్‌ ముంపు ప్రాంతాల మీదుగా దాదాపు 15-20 సార్లు తిరగడంతో ప్రజలు ఆసక్తిగా వీక్షించారు.

  • పోలవరం పూర్తిస్థాయి నీటిమట్టం 45.75 అడుగులు. ఆ కాంటూరు స్థాయిలో నీరు నిల్వ చేస్తే ఏ ప్రాంతం ముంపునకు గురవుతుందో తెలుసుకునేందుకు ప్రయత్నించారు. గతంలో నిర్వహించిన సర్వే అశాస్త్రీయంగా ఉండటంతో తాజా సర్వే అవసరమైంది. గోదావరి నదికి ఏటా వరదలు వస్తుంటాయి. ఆ సమయంలో 45-47 అడుగుల మధ్య వరద వస్తే ఏ ప్రాంతం ముంపునకు గురవుతుందో సర్వే ద్వారా తెలుసుకుంటున్నట్లు డీజీపీఎస్‌ సర్వే సభ్యుడు నర్సింహారెడ్డి తెలిపారు.

    ఇదీ చదవండి..
    Electricity Employees JAC: అక్రమ కేసులు ఎత్తేసి.. సమస్యలు పరిష్కరించాలి: విద్యుత్ ఉద్యోగుల ఐకాస

ABOUT THE AUTHOR

...view details