ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పన్ను వసూళ్లలో అలక్ష్యం...! - పశ్చిమగోదావరి జిల్లాలోని పురపాలక సంఘాల్లో పేరుకుపోయిన బకాయిలు

పశ్చిమగోదావరి జిల్లాలోని పురపాలక సంఘాల్లో పన్నుల వసూలు చేయకపోవడంలో అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోంది. 50కోట్ల రూపాయల మేర పన్ను బకాయిలు ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

Accumulated tax dues
పన్ను వసూళ్లలో అలక్ష్యం

By

Published : Mar 22, 2020, 12:06 PM IST

పన్ను వసూళ్లలో అలక్ష్యం

ప్రజల నుంచి రావాల్సిన పన్నుల బకాయిలు కోట్ల రూపాయల్లో పెరిగిపోవడంతో పురపాలక సంఘాల అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతోంది. పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు నగరపాలక సంస్థ, 8 పురపాలక సంఘాలకు 50 కోట్ల రూపాయల మేర పన్ను బకాయిలు ఉన్నాయంటే పరిస్థితి అర్థమవుతోంది.

ఆస్తి పన్ను రూపేణా 33.18 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. ఏలూరు నగరపాలక సంస్థలో 14.32 కోట్లు, తాడేపల్లిగూడెం పురపాలక సంఘంలో 5.06 కోట్లు, భీమవరం పురపాలికలో 3.97 కోట్లు, పాలకొల్లు పురపాలికలో 1.83 కోట్లు, తణుకు పురపాలికలో 2.80 కోట్లు, నరసాపురం పురపాలిక 1.39 కోట్లు, జంగారెడ్డిగూడెం పురపాలికలో 2.19 కోట్లు, నిడదవోలు పురపాలికలో 1.24 కోట్లు, కొవ్వూరు పురపాలికలో 38 లక్షల రూపాయలు ప్రజల నుంచి ఆస్తిపన్ను రూపేణా రావాల్సి ఉంది.

పదిరోజుల్లో 50 కోట్లు సాధ్యమేనా...!

ఆస్తి పన్ను బకాయిలు ఎక్కువ మొత్తం ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థల నుంచి రావాల్సి ఉంది. వీటి నుంచే సుమారు 10కోట్ల రూపాయలు అన్ని పురపాలక సంఘాలకు పన్నులు రావాల్సి ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. గడువు ఈ నెలాఖరు వరకు ఇచ్చారు. పది రోజుల వ్యవధిలో 50 కోట్ల రూపాయలు వసూలు సాధ్యమేనా అంటే సాధ్యం కాదని అధికారులు చెప్తున్నారు. కరోనా వైరస్ ప్రభావం పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలకు అనుగుణంగా నివారణ చర్యలలోను, ప్రజల్ని అప్రమత్తం చేసే చర్యలలోను తమ సిబ్బంది పని చేస్తున్నారని అధికారులు చెబుతున్నారు. పన్నులు వసూలు చేయవలసిన సమయంలో ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి పనిచేయవలసి ఉండడంతో, పన్నుల వసూళ్లకు దృష్టి కేంద్రీకరించే అవకాశం లేకుండా పోయిందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. వైరస్ ప్రభావం షెడ్యూల్ పూర్తయిన వెంటనే పన్ను బకాయిదారులకు నోటీసులు జారీ చేసి వసూలు పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు.

ఇవీ చదవండి...టెలికాం, ఇంటర్నెట్ నిరంతర సేవలకు ప్రభుత్వ ఆదేశాలు

ABOUT THE AUTHOR

...view details