పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం తల్లాడ - దేవరపల్లి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడం వల్ల ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనం ద్వారా జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండటం వల్ల రాజమహేంద్రవరం తీసుకెళ్లారు. మరో ఇద్దరు జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసినట్లు జంగారెడ్డిగూడెం ఎస్సై అల్లు దుర్గారావు తెలిపారు.
రెండు ద్వి చక్రవాహనాలు ఢీ, ఐదుగురికి గాయాలు - west godavari accident news
తల్లాడు-దేవరపల్లి జాతీయ రహదారిపై రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని రాజమహేంద్రవరం తరలించారు.
తల్లాడ-దేవరపల్లి జాతీయ రహదారిపై ప్రమాదం