పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఏలూరు కర్రల వంతెన వద్ద బైక్పై వెళుతుండగా లారీ వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనం నుజ్జు నుజ్జవగా.. వారిద్దరూ అక్కడికక్కడే మరణించారు.
మృతులను పట్టణంలోని నవాబుపేటకు చెందిన షేక్ పండు, పవర్ పేటకు చెందిన వైకే బాబులుగా గుర్తించారు. పోలీసులు అతికష్టం మీద మృతదేహాలను వెలికితీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.