తెలంగాణ రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ వద్ద ఓఆర్ఆర్పై ప్రమాదం జరిగింది. ఆంధ్రా నుంచి సీఫుడ్తో వస్తున్న కంటైనర్(AP39TQ5734)... ముందు వెళ్తున్న మరో వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా కంటైనర్ క్యాబిన్లో మంటలు చెలరేగాయి. తీవ్ర రూపం దాల్చి లారీ పూర్తిగా తగలబడిపోయింది. డోర్లు లాక్ అవడంతో డ్రైవర్ బయటకు వచ్చే పరిస్థితి కూడా లేకపోయింది.
హైదరాబాద్ ఓఆర్ఆర్పై ప్రమాదం.. సజీవ దహనమైన ఇద్దరు ఏపీ వాసులు
హైదరాబాద్ నగరశివారులోని అప్ప జంక్షన్ సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డుపై ఓ కంటైనర్ ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో డ్రైవర్, క్లీనర్ అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతులు ఏపీ వాసులుగా గుర్తించారు.
డ్రైవర్ ఆర్తనాదాలు విని కొందరు వాహనదారులు అతనిని బయటకు తీసేందుకు ప్రయత్నించినా అవీ విఫలమయ్యాయి. మంటల్లో చిక్కుకుని వాహనంలోని ఇద్దరు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశారు. క్యాబిన్లో ఇరుక్కున్న మృతదేహాలను వెలికి తీశారు. మృతులు ఏపీ వాసులుగా గుర్తించారు. మంటల్లో డ్రైవర్ సూరజ్, క్లీనర్ మృత్యుంజయ సజీవదహనం అయ్యారు. ఆ వాహనం పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నుంచి వస్తున్నట్లు తెలిసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ భాస్కర్ తెలిపారు.
ఇదీ చూడండి:అంబేడ్కర్ జయంత్యుత్సవాల్లో అపశ్రుతి.. విద్యుదాఘాతంతో యువకుడు మృతి