పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు ఢీకొన్న ఘటనలో.. ఇద్దరు మృతిచెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఉంగుటూరు మండలం కైకరం గ్రామానికి చెందిన బేతా గోవిందరాజు, డ్రైవర్ జక్కుల శివాజీలుగా పోలీసులు గుర్తించారు. కైకవరం నుంచి రాజమండ్రికి.. పెళ్లి చూపులకు వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. ఘటనలో గాయపడ్డ వారిని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Accident: ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు.. ఇద్దరు మృతి - పశ్చిమగోదావరి జిల్లా అనంతపల్లిలో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో ఇద్దరు మరణించగా.. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు ఢీకొనటంతో ప్రమాదం చోటుచేసుకుంది.

ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు.. ఇద్దరు మృతి