ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ACB RAIDS: తణుకు సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయంలో అనిశా దాడులు - crime news

పశ్చిమ గోదావరి జిల్లా తణుకు సబ్‌ రిజిస్ట్రారు కార్యాలయంపై అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మికంగా దాడి చేశారు. ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్ వద్ద అనధికారికంగా ఉన్న రూ. 54,100ను స్వాధీనం చేసుకున్నారు.

తణుకు సబ్‌ రిజిస్ట్రారు కార్యాలయంలో అనిశా దాడులు
తణుకు సబ్‌ రిజిస్ట్రారు కార్యాలయంలో అనిశా దాడులు

By

Published : Aug 13, 2021, 10:59 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా తణుకు సబ్ రిజిష్ట్రారు కార్యాలయంలో అవినీతి ఎక్కువగా జరుగుతోందని, రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వారి నుంచి అధిక మొత్తంలో సొమ్ము వసూలు చేస్తున్నారని వచ్చిన ఫిర్యాదుల మేరకు అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మికంగా దాడి చేశారు. ఇన్చార్జి సబ్ రిజిష్ట్రారు రాంబాబు వద్ద అనధికారికంగా ఉన్న రూ. 54,100ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

సోదాలు పూర్తిస్థాయిలో కొనసాగుతాయని అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ ప్రసాద్​ వెల్లడించారు. కార్యాలయంలో ఇతర అవకతవకలు కూడా జరిగినట్లు సమాచారం వారి వద్ద ఉందని అన్నారు. వాటి మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details