లంచం కోసం డిమాండ్ చేసిన బిల్ కలెక్టర్‌ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నూతనంగా నిర్మించిన గృహానికి.. ఇంటి పన్ను అంచనా వేసి చెప్పాలని కోరుతూ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన గూడూరి శ్రీనివాసరావు 2019లో మున్సిపాలిటీకి దరఖాస్తు చేశాడు. రెండేళ్లుగా కాలయాపన చేసిన బిల్ కలెక్టర్ పెచ్చేటి ఆంజనేయులు లంచం కోసం డిమాండ్ చేయగా.. గూడూరి శ్రీనివాస్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రూ.1500 ఆంజనేయులుకు ఇస్తుండగా ఏలూరు నుంచి వచ్చిన ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు వెల్లడించారు.
రూ.1500 లంచం తీసుకుంటూ అనిశాకు చిక్కిన బిల్ కలెక్టర్ - bheemavaram bill collector 1500 rupees bribary case
రూ. 1500 లంచం తీసుకుంటూ భీమవరం మున్సిపాలిటీకి చెందిన బిల్ కలెక్టర్ ఆంజనేయులు అనిశాకు చిక్కాడు. కొత్తగా కట్టుకున్న ఇంటికి.. పన్ను అంచనా గురించి ఓ వ్యక్తి దరఖాస్తు చేసుకోగా లంచం డిమాండ్ చేశాడు. డబ్బు తీసుకుంటున్న క్రమంలో అనిశా అధికారులు పట్టుకున్నారు.

అనిశా వలలో భీమవరం మున్సిపల్ బిల్ కలెక్టర్