ఉన్నత పాఠశాలపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ జేఎన్వీఆర్ హై స్కూల్లో చోటు చేసుకుంది. పదో తరగతి సర్టిఫికెట్ పోవడంతో మారు పత్రాల కోసం పూర్వ విద్యార్థి సూర్య ప్రకాష్ ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్‌కు దరఖాస్తు చేసుకున్నాడు.
అనిశాను ఆశ్రయించిన బాధితుడు..
పత్రం అందించేందుకు ప్రధానోపాధ్యాయుడు సుమారు రూ. పది వేల రూపాయలు డిమాండ్ చేశాడు. ఫలితంగా సూర్య ప్రకాష్ అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించాడు. ప్రధానోపాధ్యాయుడు జే. శ్రీనివాస్ రూ. 10,000 లంచం తీసుకుంటుండగా ఆకస్మికంగా దాడి చేసి పట్టుకున్నామని ఏసీబీ డీఎస్పీ ఎస్ వెంకటేశ్వర్లు వెల్లడించారు.
ఇవీ చూడండి :
'చంద్రబాబుకు పేరు దక్కకూడదనే అమరావతిని అడ్డుకుంటున్నారు'