ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కబ్జా కోరల్లో 'పానకాల చెరువు' - పానకాల చెరువు

ఒకప్పుడు వెయ్యి ఎకరాలకు నీరిందించిన చెరువు...నేడు వంద ఎకరాలకు కూడా నీరివ్వలేని పరిస్థితి. 120 ఎకరాల విస్తీర్ణం ఉన్న చెరువు..ఇవాళ 60 ఎకరాలే మిగిలింది. అదే పశ్చిమగోదావరి జిల్లాలోని పానకాల చెరువు దుస్థితి.

చెరువును మింగేస్తున్న అక్రమార్కులు

By

Published : Jul 4, 2019, 6:22 AM IST

పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం అక్కంపేటలో పానకాల చెరువు ఆక్రమణకు గురైంది. మొత్తం 120 ఎకరాల విస్తీర్ణం ఉన్న చెరువులో... నేడు 60 ఎకరాలే మిగిలింది. మూడు గ్రామాల్లో వెయ్యి ఎకరాల సాగుకు నీరిందించిన చెరువు...ఇవాళ 100 ఎకరాలకు కూడా నీరు అందించలేని స్థితికి చేరిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి ఆక్రమణదారులు వలస వచ్చి...చెరువు గర్భంలోని మట్టిని తవ్వి పల్లపు ప్రాంతాలను ఎత్తు చేసుకుని పంటలు పండిస్తున్నారు. పానకాల చెరువు ప్రతి ఏడాది ఆక్రమణకు గురవటంతో...వర్షాకాలం చెరువు పొంగి సమీప పంట పొలాలను నాశనం చేస్తుందని ...ఆయకట్టు ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా నీటి పారుదల శాఖ అధికారులు ఆక్రమణ గుర్తించి..స్వాధీనం చేసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

ఆక్రమణకు గురైన పానకాల చెరువు

ABOUT THE AUTHOR

...view details