పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఫిల్హౌస్పేటకు చెందిన ఓ కుటుంబానికి కరోనా సోకింది. వారిలో తల్లితండ్రులు, కుమార్తెను ఆశ్రం కోవిడ్ ఆసుపత్రిలో చేర్చారు. 24 ఏళ్ల కుమారుడికి కరోనా లక్షణాలు అంతగా లేకపోవడంతో హోంక్వారంటైన్లో ఉంచారు. కొన్నాళ్లుగా ఒంటరిగా ఉండటంతో అతడు కుంగుబాటుకు గురై, బుధవారం ఇంట్లో ఫ్యాన్ కొక్కానికి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
కుటుంబమంతటికీ కరోనా.. కుంగుబాటుతో యువకుడి ఆత్మహత్య - ఫిల్హౌస్పేటలో యువకుడి మృతి
హోంక్వారంటైన్లో ఉన్న ఓ యువకుడు కుంగుబాటుకు గురై ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఫిల్హౌస్పేటలో జరిగింది. మృతుడి కుటుంబమంతా..కోవిడ్ ఆసుపత్రిలో ఉన్నారు.
కుంగుబాటుతో యువకుడి ఆత్మహత్య