ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

యువతి హత్య.. సహజీవనం చేస్తున్న వ్యక్తిపై పోలీసుల అనుమానం - vandram latest news

పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం వాండ్రం గ్రామంలో ఓ యువతి దారుణ హత్యకు గురైంది. ఆమెతో సహజీవనం చేస్తున్న వ్యక్తి ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

police inspection
హత్య జరిగిన ప్రదేశాన్ని పరిశీలిస్తున్న పోలీసులు

By

Published : Apr 24, 2021, 9:08 AM IST

పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం వాండ్రంలో కోనల మౌనిక(21) అనే యువతి హత్యకు గురైంది. గ్రామంలోని ఐస్​ ఫ్యాక్టరీ పక్కన ఆమె మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పరిసరాలను పరిశీలించారు. ఆమె ఒంటిపై కత్తిపోట్లు.. మృతదేహం పక్కన రక్తపు మరకలతో చాకు గుర్తించారు.

కుటుంబసభ్యుల వివరాల ప్రకారం..

మొదటి భర్తతో విడాకులు తీసుకున్న మౌనిక ఆది అనే యువకుడితో సహజీవనం చేస్తోంది. ఇటీవల ఆమె గర్భం దాల్చింది. బయటికి వెళ్దామని చెప్పి.. ఆమెను తీసుకెళ్లాడు. రక్తపు చేతులతో పరిగెత్తుతుండగా చూసినట్లు నాగరాజు అనే యువకుడు చెప్పాడు. దీంతో ఆదినే మౌనికను చంపి ఉంటాడని భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మరింత లోతుగా దర్యాప్తు చేపట్టి పూర్తి వివరాలు సేకరిస్తామన్నారు.

ఇదీ చదవండి:అనకాపల్లి జాతీయ రహదారిపై ప్రమాదం.. యువకుడు మృతి

ABOUT THE AUTHOR

...view details