వైకాపా నాయకులు తన ఇంటిని లాక్కున్నారని ఆరోపిస్తూ... పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్ వద్ద ఎలిజిబెత్ రాణి అనే మహిళ ఆందోళన చేశారు. తన ఇంటిని దౌర్జన్యంగా వైకాపా నాయకులు లాక్కొని.. తనను వీధి పాలు చేశారని కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. అక్కడే ఉన్న గాంధీ విగ్రహం వద్ద నిరసన దీక్ష చేపట్టారు.
తాను నిర్మించుకున్న ఇంటిని ఏలూరుకు చెందిన వైకాపా నాయకులు స్వాధీనం చేసుకొన్నారని.. తనను కట్టుబట్టలతో బయటకు గెంటేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదన్నారు. ఏలూరు నగరానికి చెందిన ఈ వృద్ధురాలు... తనకు న్యాయం చేయాలని కోరుతున్నారు.