ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'నా భార్యను ఆ నరకం నుంచి భారత్​కు రప్పించండి' - పశ్చిమ గోదావరి జిల్లా క్రైమ్ న్యూస్

గల్ఫ్ దేశమైన మస్కట్​లో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ మహిళ నరకం అనుభవిస్తోంది. కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉందామని పరాయి దేశం వెళ్లిన ఆ మహిళను... అక్కడి వారు చిత్రహింసలకు గురి చేశారు. కనీసం భోజనం కూడా పెట్టకుండా లైంగికంగా వేధించేవారని బాధితురాలు ఓ వీడియోలో పేర్కొంది. తన భార్యను అక్కడి నుంచి భారత్​కు తిరిగి రప్పించాలని ఆమె భర్త కోరుతున్నారు.

A woman from West Godavari district is struggling in Muscat
A woman from West Godavari district is struggling in Muscat

By

Published : Feb 8, 2020, 10:33 PM IST

బాధితురాలి ఆవేదన

పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం పెద్దపేటకు చెందిన ఓ మహిళను... ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి అదే ప్రాంతానికి చెందిన ఓ ఏజెంట్ గతేడాది గల్ఫ్​కు పంపాడు. 2019 జులై 2న ఆమె భర్త.... ఉపాధి కోసం వెళుతున్న తన భార్యను దిల్లీ వరకు వెళ్లి విమానమెక్కించాడు. మొదట కువైట్ అని చెప్పి ఆ తరువాత సదరు మహిళను దుబాయ్​కు పంపించాడు ఆ ఏజెంట్. మరికొందరితో కలిసి అక్కడ ఓ దుబాయ్ సేఠ్​కు ఆమెను విక్రయించాలని చూశాడు. ఆమె ఒప్పుకోని కారణంగా తీవ్రంగా హింసించారు. కొన్ని రోజుల తరువాత ఉపాధి కల్పిస్తామని చెప్పి ఆమెను ఆ దేశంలోని ఏజెంట్లు మస్కట్​కు​ పంపారు.

అక్కడా చిత్ర హింసలు

మస్కట్​లో ఓ వృద్ధుడి ఇంటికి బాధితురాలిని పంపగా అక్కడ ఆమెకు చిత్రహింసలు ఎక్కువయ్యాయి. ఆ ఇంటి యజమాని అయిన ఓ వృద్ధుడు తన పట్ల సైకోలా ప్రవర్తించేవాడని బాధితురాలు తమ బంధువులకు పంపిన ఓ వీడియోలో తెలిపింది. భోజనం పెట్టకుండా లైంగికంగా వేధించేవాడని తమ కుమారులతో కొరికించేవాడని ఆవేదన వ్యక్తం చేసింది. అక్కడ కొన్ని రోజుల పాటు కష్టాలు అనుభవించిన ఆ మహిళ... ఓ పాస్టర్ సాయంతో తప్పించుకుని మస్కట్​లోని భారత ఎంబసీకి చేరుకుంది. నాలుగు నెలలుగా అక్కడే ఉంటోంది. ఆమె పాస్​పోర్టును ఏజెంట్లు తీసుకున్న కారణంగా.. భారత్​కు తిరిగిరాలేక అక్కడే ఆశ్రయం పొందుతోంది. ఎంబసీలో ఉన్నప్పటికీ సరైన ఆహారం లేక అవస్థలు పడుతోంది.

సాయం చేయండి

ఈటీవీ భారత్​తో బాధితురాలి భర్త

నరకం లాంటి ఆ దేశంలో ఎన్నో ఇబ్బందులు పడుతున్న ఆమెను తిరిగి భారత్​కు రప్పించాలని బాధితురాలి భర్త, ఆమె తల్లి కోరుతున్నారు. ఏజెంట్లు ఉద్యోగాల పేరుతో భీమవరం, వీరవాసరం తదితర ప్రాంతాలకు చెందిన ఎంతో మంది మహిళలను మోసం చేశారని ఆయన తెలిపారు. తన భార్యతో పాటు మిగిలిన వాళ్లను స్వదేశానికి రప్పించాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి:

నాలుగు నెలలుగా ఇంట్లోనే మృతదేహం

ABOUT THE AUTHOR

...view details