పదవ తరగతి చదువుతున్న తన కూతురిని వేధిస్తున్న ఆటో డ్రైవర్‌కు దేహశుద్ధి చేసింది విద్యార్థిని తల్లి. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం విస్సాకోడేరులో ప్రేమిస్తున్నానంటూ ఓ విద్యార్థినిని ఆటో డ్రైవర్ రమేష్ వేధింపులకు గురిచేశాడు. అతని ఆగడాలు శృతిమించడం వల్ల ఆమె విషయం తల్లిదండ్రులకు చెప్పింది. ఆటో డ్రైవర్‌ను తల్లిదండ్రులు, బంధువులు స్కూల్ దగ్గర చాకచక్యంగా పట్టుకున్నారు. రమేష్‌కు విద్యార్థి తల్లి దేహశుద్ధి చేసింది. ఆటో డ్రైవర్ రమేష్ పేరుపాలెంకు చెందినవాడిగా గుర్తించారు. రమేష్‌కు దేహశుద్ధి చేస్తున్న దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
కూతురిని వేధిస్తున్న ఆటోడ్రైవర్‌కు తల్లి దేహశుద్ధి - ఆటోడ్రైవర్‌ను చితకబాదిన తల్లి
కూతుర్ని ఆటో డ్రైవర్ వేధిస్తున్నాడని తెలిసిన ఆ తల్లికి కోపం కట్టలు తెంచుకుంది. బంధువుల సాయంతో స్కూల్ దగ్గరే ఆటోడ్రైవర్ని పట్టుకున్నారు. తన కూతురి కన్నీటికి కారణమైన అతడిని చూడగానే ఆమె ఆటోడ్రైవర్‌పై విరుచుకుపడింది. పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం విస్సాకోడేరులో ఈ ఘటన జరిగింది.
ఆటోడ్రైవరను కొడుతున్న విద్యార్థిని తల్లి