పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం మండలం కడియద్ద గ్రామంలో దారుణం జరిగింది. మతి స్థిమితం సరిగా లేని జాలపర్తి రమేష్ అనే వ్యక్తి... తన తల్లిదండ్రులను రాడ్తో కొట్టి హత్య చేశాడు. అనంతరం పారిపోతూ అక్క, అన్నలకు తారసపడ్డాడు. అతన్ని పట్టుకునేలోపే పరారయ్యాడు. సమాచారం అందుకున్న కొవ్వూరు డీఎస్పీ రాజేశ్వరరెడ్డి, తాడేపల్లిగూడెం రూరల్ సీఐ రవికుమార్ అక్కడికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మతిస్థిమితం లేని కుమారుడు.. తల్లిదండ్రులను కడతేర్చాడు - man murdered his parents in west godavari
పున్నామ నరకం నుంచి తప్పించేవాడు పుత్రుడు అంటారు. అలాంటిది కన్న కొడుకే ఆ తల్లిదండ్రులను కడతేర్చాడు. మానసికి స్థితి సరిగా లేని తమ కుమారుడికి చికిత్స చేయించాలని అనుకున్నారు ఆ కన్నవారు. ఈ లోపే ఆ యువకుడు వారిపై రాడ్తో దాడి చేసి దారుణంగా హతమార్చాడు. పశ్చిమగోదావరి జిల్లా కడియద్ద వద్ద జరిగిన దారుణ ఘటన వివరాలివి...!
మతిస్థిమితం లేని కుమారుడు.. తల్లిదండ్రులను కడతేర్చాడు
TAGGED:
west godavari crime news