పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం రాఘవాపురం గ్రామంలో రోడ్డు ప్రమాదం జరిగింది.ద్విచక్ర వాహనాన్ని కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న చింతకాయల కొత్తగూడెం గ్రామానికి చెందిన మాతంగి నవీన్ (21) అనే వ్యక్తి మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్ లో తరలించారు.
బైక్ను ఢీకొట్టిన కారు.... ఒకరు మృతి,మరో ఇద్దరి పరిస్థితి విషమం - Road accident in Raghavapuram, West Godavari district
ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలైన ఘటన పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం రాఘవాపురం గ్రామంలో జరిగింది.
ద్విచక్రవాహనాన్నిఢీకొట్టిన కారు.... ఒకరు మృతి
Last Updated : Jan 15, 2021, 3:15 AM IST