ఆర్టీసీ అద్దె బస్సు ఢీకొని వ్యక్తి మృతి - latest road accident news in dhendhuluru
పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం సోమవరప్పాడులో విషాదం జరిగింది. ఆర్టీసీ అద్దె బస్సు ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఇంకో మూడు రోజుల్లో కుమార్తె పెళ్లి చేయటానికి అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్న సమయంలో ప్రమాదం జరగటంతో మృతుని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం సోమవరప్పాడులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ అద్దె బస్సు ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. వీరభద్రపురం గ్రామానికి చెందిన ముక్కేల్లి శ్రీను ట్రాక్టర్ డ్రైవర్గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈనెల 4న కుమార్తె వివాహం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రాక్టర్ల యజమానులతో మాట్లాడేందుకు సోమవరప్పాడు వెళ్తుండగా ఏలూరు నుంచి జంగారెడ్డిగూడెం వైపు వెళ్తున్న ఆర్టీసీ అద్దె బస్సు ఢీకొట్టటంతో శ్రీను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఫలితంగా ఆ ఇంట్లో విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.