ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

టీచర్​పై దాడి.. భర్తే నిందితుడు..! - భార్యపై కత్తితో దాడి చేసిన భర్త

కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి తన భార్యపై కత్తితో విచక్షణారహింతంగా దాడిచేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ బాధితురాలు తణుకు జిల్లా ఆస్పత్రితో చికిత్స పొందుతున్నారు. ఈ దారుణం పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలంలో జరిగింది.

a man attack on his wife
పాఠశాలలోనే భార్యపై దాడిచేసిన భర్త

By

Published : Feb 26, 2021, 10:34 PM IST

పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలంలో ఓ వ్యక్తి తన భార్యపై కత్తిలో దాడి చేశారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన దంపతులు... కుటుంబ కలహాల కారణంగా నాలుగు నెలల క్రితం ఘర్షణ పడ్డారు. ఈ క్రమంలో భార్య వారి పాపను తీసుకుని తన బంధువుల ఇంటికి వెళ్లింది. అక్కడి నుంచే రోజూ పాఠశాలకు (విధులకు) వెళ్లి వస్తుంది.

పాఠశాలలో ఉన్న తన భార్య దగ్గరికి వచ్చిన భర్త​ ఒక్కసారిగా ఆమెపై కత్తిలో దాడి చేశాడు. ఈ మేరకు పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. గాయపడ్డ ఆమెను తణుకులోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తన భర్తను కఠినంగా శిక్షించాలని బాధితురాలు డిమాండ్ చేశారు.

పోలీసుల అదుపులో నిందితుడు..

నిందితుడిని ఇరగవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతనిపై వివిధ పోలీస్ స్టేషన్​లలో కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు
ఇదీ చదవండి:తెలంగాణ : మద్యం మత్తులో గొంతు కోసుకున్నాడు..

ABOUT THE AUTHOR

...view details