పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని టైలర్ ఉన్నత పాఠశాల 1988- 89 సంవత్సరానకి చెందిన పదో తరగతి విద్యార్థుల ఆధ్వర్యంలో కొన్ని రోజులుగా పేదలకు నిత్యావసరాలు, కూరగాయలు పంపిణీ చేస్తున్నారు. ప్రజలెవరూ ఇళ్లనుంచి బయటకు రాకూడదని, కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి సహకరించాలని కోరారు.
పేదలకు నిత్యావసరాలు అందజేసిన పూర్వవిద్యార్థుల బృందం - నర్సాపురం నేటి వార్తలు
రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్డౌన్తో పనులు లేక ఇబ్బంది పడుతున్న పేదలకు సహాయం చేసేందుకు పలువురు దాతలు ముందుకొస్తున్నారు. ఆపదలో ఆదుకుంటూ బాసటగా నిలుస్తున్నారు. ఆకలితో అలమటిస్తున్న వారికి చేయూత నిస్తూ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు.
పేదలకు నిత్యావసరాలు అందజేసిన పూర్వవిద్యార్థుల బృందం