పశ్చిమగోదావరిజిల్లా ఏలూరులో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడని ఆమె ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. పట్టణానికి చెందిన సౌజన్య హైదరాబాదులోని ఓ ఫార్మా కంపెనీలో పనిచేస్తోంది. లాక్డౌన్ నుంచి ఆమె ఇంటి వద్దనుంచే విధులు నిర్వర్తిస్తోంది. సింహాద్రి అనే వ్యక్తి ప్రేమించాడని..పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని మృతురాలి తండ్రి ఆరోపించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడని యువతి ఆత్మహత్య - ఏలూరులో ప్రేమ వార్తలు
ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడని ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జరిగింది.

ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడని యువతి ఆత్మహత్య