తమ కుటుంబానికి రక్షణ కల్పించాలంటూ... పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు మండలం సమిశ్రిగూడెంకు చెందిన సత్యకృష్ణ అనే వ్యక్తి జిల్లా ఎస్పీని ఆశ్రయించారు. కుటుంబంతో వచ్చిన ఆయన ఏలూరులోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో వినతిపత్రం అందించారు. కొందరు అధికార పార్టీకి చెందిన నాయకులు, స్థానిక పోలీసుల సాయంతో తమ ఆస్తులను ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని వినతి పత్రంలో పేర్కొన్నారు. తమ ఇంటి వద్ద టెంట్లు వేసి.. మనషులను ఏర్పాటు చేసి.. భయభ్రాంతులకు గురిచేస్తున్నారని వివరించారు. స్థానిక పోలీసులు పట్టించుకోవడంలేదని... తమకు రక్షణ కల్పించాలని కోరారు .
'అధికార పార్టీ నాయకులు మమ్మల్ని బెదిరిస్తున్నారు' - west godavari dst policts
అధికార పార్టీ నాయకులు తమను భయభ్రాంతులకు గురిచేస్తున్నారంటూ... పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన సత్యకృష్ణ అనే వ్యక్తి జిల్లా ఎస్పీని ఆశ్రయించారు. నాయకుల నుంచి తనకు ఉన్న ఇబ్బందులన్నింటినీ వినతిపత్రంలో పేర్కొని ఎస్పీకి అందించారు.
a family complaint on ycp leaders about threatening to their family in west godavari dst
TAGGED:
west godavari dst policts