ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆదరించిన కుటుంబం కోసం ప్రాణాలొడ్డిన శునకం

విశ్వాసానికి మారుపేరు కుక్క. కొంచెం ఆదరిస్తే చాలు కదలకుండా మన ఇంటిని కాపలాకాస్తుంది. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి పట్టణంలో ఓ శునకం ఇంట్లోకి ప్రవేశించిన పాముతో పోరాటం చేసి..దానిని చంపి కుటుంబ సభ్యులను కాపాడింది. ఈ క్రమంలోనే పాము కరవటంతో... ఆ శునకం కూడా ప్రాణం కోల్పోయింది.

dog and snake fight in chinthlapudi
పాముతో పోరాడి ప్రాణాలు వదిలిన శునకం

By

Published : Nov 14, 2020, 4:03 PM IST

Updated : Nov 14, 2020, 4:58 PM IST

పాముతో పోరాడి ప్రాణాలు వదిలిన శునకం

పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి పట్టణం కొవ్వూరుగూడెంలో రిటైర్డ్ టీచర్ కల్వకుర్తి నాగేశ్వరరావు గత ఐదేళ్లుగా జపాను షెపర్డ్​కు చెందిన ఓ శునకాన్ని పెంచుకుంటున్నారు. దానిని ముద్దుగా రాయ్ అనే పేరుతో పిలుచుకుంటున్నారు. అయితే శుక్రవారం రాత్రి ఇంటి ఆవరణలోకి ఓ త్రాచుపాము ప్రవేశించింది. దానిని గుర్తించిన శునకం రాయ్ అడ్డుపడి పోరాటం చేసి పామును తీవ్రంగా గాయపరిచింది. ఈ క్రమంలో పాము రాయ్​ను పలుమార్లు కాటువేయడంతో కొద్ది సేపటికే మృతి చెందింది. దీంతో ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న శునకం తమ ప్రాణాలను కాపాడేందుకు చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు పెట్టుకున్నారు. అనంతరం రాయ్ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.

Last Updated : Nov 14, 2020, 4:58 PM IST

ABOUT THE AUTHOR

...view details