VIRAL VIDEO: ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై... కారు డ్రైవర్ దాడి.. దృశ్యాలు వైరల్ - భీమవరం వార్తలు
14:37 May 03
పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఘటన
పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై కారు డ్రైవర్ దాడికి దిగాడు. అత్యంత వేగంగా వెళ్తున్న కారును ఆపేందుకు కానిస్టేబుల్ యత్నించాడు. దాంతో ఆగ్రహించిన కారు డ్రైవర్ కానిస్టేబుల్‌పై దౌర్జన్యం ప్రదర్శించాడు. పిడిగుద్దులు గుద్ది .. దాడి చేశాడు. కారు డ్రైవర్.. భీమవరంలోని గునుపూడికి చెందిన సంతోశ్‌గా గుర్తించారు. కారు డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. కానిస్టేబుల్‌పై దాడి దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
ఇదీ చదవండి:విజయనగరంలో మహిళపై అత్యాచారం... పోలీసుల అదుపులో నిందితుడు